కస్తూర్బా పాఠశాలలో మురుగునీటి సమస్యకు పరిష్కార చర్యలు

1001325361.jpg

వెల్దండ నవంబర్ 03 : మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఆవరణలో మురుగునీరు నిల్వ ఉండటంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఈ మేరకు మంగళవారం గ్రామ సర్పంచ్ మట్టా యాదమ్మ వెంకటయ్య గౌడ్, ఎంపీడీవో సులోచన, పాఠశాల ప్రిన్సిపాల్ స్రవంతి మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. పాఠశాల సమీపంలోని పంట పొలాలకు మురుగునీరు వెళ్లకుండా అడ్డుకోవడంతో సమస్య ఏర్పడినట్లు గుర్తించారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని పంట పొలాలకు ఇబ్బంది కలగకుండా అంతర్గత కాలువల నిర్మాణం చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని సర్పంచ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ లింగయ్య, పంచాయతీ కార్యదర్శి గిరి, వార్డు సభ్యులు కిస్టల్, వెంకటేష్, మారపల్లి మంజుల శ్రీను, నాయకులు రషీద్, మట్టా భరత్ గౌడ్, కొండల్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...