ఎంఈఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నూత్పల్లి మారుతి
- ఎంఈఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నూత్పల్లి మారుతి - September 29, 2026
ఎంఈఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నూత్పల్లి మారుతి
హైదరాబాద్: మాదిగ ఎంప్లాయీస్ ఫోరం (MEF) తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నూత్పల్లి మారుతి నియమితులయ్యారు. ఎం.ఈ.ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆయనకు ఈ బాధ్యతలను అప్పగించారు.
ఈ సందర్భంగా నూత్పల్లి మారుతి మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించిన మందకృష్ణ మాదిగకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తూ, తెలంగాణలో మాదిగ ఉద్యోగులను ఐక్యం చేసి వారి సమస్యలు, హక్కులు మరియు సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు.
సంఘాన్ని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేయడంతో పాటు, ఉద్యోగుల సమస్యలను సంబంధిత వర్గాల దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారాల కొరకు నిరంతరం పనిచేస్తానని ఆయన అన్నారు.
