ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ప్రైవేట్ అంబులెన్సులపై ఆరోపణలు
- ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ప్రైవేట్ అంబులెన్సులపై ఆరోపణలు - September 23, 2026
- మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్ - September 23, 2026
- ఆపదలో అండగా మురళి కుటుంబానికి జోగయ్య ఆర్థిక భరోసా - September 23, 2026

కల్వకుర్తి: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రైవేట్ అంబులెన్సుల వ్యవహారంపై ప్రజల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర వైద్య సేవల పేరుతో ఆసుపత్రి పరిసరాల్లో ప్రైవేట్ అంబులెన్సులు నిలిపి ఉంచి, హైదరాబాద్‌కు తరలించే రోగుల నుంచి అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.సుమారు 100 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్‌కు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కొన్ని అంబులెన్సుల్లో కనీస అత్యవసర వైద్య సదుపాయాలు లేకపోవడంతో పాటు, కాలం చెల్లిన వాహనాలను వినియోగిస్తున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి.ఓ సేవా సంస్థ ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్‌కు సైతం డ్రైవర్ బత్తా పేరుతో నగదు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖ, రవాణాశాఖ అధికారులు స్పందించి అంబులెన్సుల ఫిట్నెస్, అత్యవసర సదుపాయాలు, చార్జీలపై తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
