మృతుని కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థిక చేయూత
- వర్షాల వేల ప్రజల కోసం సేవ ముందస్తు చర్యలు - September 22, 2026
- ఎల్ నినో ప్రభావం పై అవగాహన లేకుండా బీఆర్ఎస్ నేతలు ధర్నాలు – మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీత నరసింహాం - September 22, 2026
- మృతుని కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థిక చేయూత - September 22, 2026
వెల్దండ: మండల పరిధిలోని కోట్ర గ్రామానికి చెందిన దుద్దుర్కు ఎల్లయ్య ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న కోట్ర గ్రామ టీఆర్‌ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ నీరటి రాములు ద్వారా సమాచారం అందడంతో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ స్పందించారు.మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ రూ.3,000 ఆర్థిక సహాయాన్ని ఎల్లయ్య భార్య లక్ష్మికి అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు.కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పోతేపల్లి అశోక్, ఉడుతల అల్లాజీ, జమ్ములు జంగయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు.
