జూరాల నీటి విషయంలో రైతులను తప్పుతోవ పట్టించొద్దు – మంత్రి జూపల్లి కృష్ణారావు
- ఎల్ నినో ప్రభావం పై అవగాహన లేకుండా బీఆర్ఎస్ నేతలు ధర్నాలు – మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీత నరసింహాం - September 22, 2026
- మృతుని కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థిక చేయూత - September 22, 2026
- మహా పాదయాత్రకు మద్దతుగా భారీగా తరలివస్తాం – ఎర్రవల్లి భూనిర్వాసితులు - September 22, 2026

నాగర్ కర్నూల్: జూరాల ప్రాజెక్టు నీటి విడుదల విషయంలో రైతులను తప్పుదోవ పట్టించేలా రాజకీయ ఆరోపణలు చేయొద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు, ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో, బాష్పీభవనం, కర్ణాటకలో వర్షపాతం, అక్కడి ప్రాజెక్టుల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నీటి నిర్వహణ చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. రైతుల పంటలను కాపాడేందుకు అందుబాటులో ఉన్న నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగిస్తున్నామని, నీటి విషయంలో రాజకీయాల కంటే వాస్తవాలు, లెక్కలు, శాస్త్రీయ విధానమే ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు.
