యువతకు ఉద్యోగ అవకాశాలే లక్ష్యం : జాబ్ డ్రైవ్ లు కొనసాగిస్తా – సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి
- మైసమ్మ కాలనీ గణనాధుని సన్నిధిలో మహా అన్నదానం - September 22, 2026
- జూరాల నీటి విషయంలో రైతులను తప్పుతోవ పట్టించొద్దు – మంత్రి జూపల్లి కృష్ణారావు - September 22, 2026
- తలకొండపల్లి లో గ్యాస్ సిలిండర్ల కొరత .! - September 22, 2026
తుక్కుగూడ: నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ డ్రైవ్‌లు నిరంతరం కొనసాగిస్తామని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.తుక్కుగూడలోని ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలో నిర్వహించిన జాబ్ డ్రైవ్ ఇంటర్వ్యూకు కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి 20 మంది నిరుద్యోగ యువత హాజరయ్యారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి మాట్లాడుతూ, యువతకు అందుబాటులోకి వచ్చే ప్రతి ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని సూచించారు.యువతకు ఉపాధి కల్పించడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే తన లక్ష్యమని తెలిపారు. అర్హత, నైపుణ్యాలకు అనుగుణంగా లభించే అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని కోరారు.కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు వీర, మహేష్, శ్రీనివాస్, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
