జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు పారిజాత నరసింహారెడ్డికి ఎమ్మెల్యే కసిరెడ్డి అభినందనలు
- మతిస్థిమితం లేని వృద్ధుడి ఆచూకీ కోసం విజ్ఞప్తి - September 22, 2026
- సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా బాధ్యత కుటుంబాలకు ఎమ్మెల్యే చేయూత - September 22, 2026
- జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు పారిజాత నరసింహారెడ్డికి ఎమ్మెల్యే కసిరెడ్డి అభినందనలు - September 22, 2026

కల్వకుర్తి సెప్టెంబర్ 22:రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఇటీవల ఎన్నికైన శ్రీమతి చిగురింత పారిజాత నర్సింహారెడ్డి గారు హైదరాబాద్లోని కల్వకుర్తి ఎమ్మెల్యే శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆమెను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
