పోలీస్ ప్రజావాణికి 13 ఫిర్యాదులు

1001200274.jpg

నాగర్‌కర్నూల్ జిల్లా: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ ప్రజావాణి కార్యక్రమానికి 13 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు.ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ, వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు బాధ్యతతో వ్యవహరించి, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ సూచించారు.

You may also like...