హలో ఉద్యమకారుడా 27న చలో యాదగిరిగుట్ట
- హలో ఉద్యమకారుడా 27న చలో యాదగిరిగుట్ట - September 20, 2026
- జీఎంఆర్ కాలనీలో మహా అన్నదానం - September 20, 2026
- జిఎంఆర్ కాలనీ భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలి - September 19, 2026
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టీయూఎఫ్) 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సెప్టెంబర్ 27న యాదగిరిగుట్టలో నిర్వహించనున్నట్లు టీయూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ తెలిపారు. జనగామలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉద్యమకారుల ఐక్యతతోనే తమ డిమాండ్ల సాధనకు ప్రభుత్వం స్పందించిందని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమకారులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథులకు ఆహ్వానాలు అందజేశారు. ఉద్యమ చరిత్ర, FIRలు, జైలు శిక్షలు, అమరుల కుటుంబాల వివరాల ఆధారాలను సభలో సమర్పించాలని కోరారు.
