ముత్యాలమ్మ ఆలయానికి మార్కెట్ కమిటీ చైర్మన్ రూ. 25 వేల విరాళం

వెల్దండవెల్దండ మండలం నగరగడ్డ తండా గ్జరామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీశ్రీ ముత్యాలమ్మ దేవాలయానికి కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనీలా సంజీవ్ కుమార్ యాదవ్ రూ.25,000/-ఆర్థిక సహాయం అందజేశారు.ఈ మేరకు ఆలయ నిర్మాణ కమిటీకి సంబంధించిన చెక్కును తండా గ్రామ పెద్దల సమక్షంలో అందజేశారు. గ్రామంలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఆలయ నిర్మాణానికి ఈ విరాళం ఎంతగానో దోహదపడుతుందని గ్రామస్తులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్. లాలు నాయక్, వస్య నాయక్, సబావత్ నాను, చందర్, బిక్కు, శంకర్, గోపాల్, నరేష్, శ్రీనివాస్, పాండు, లోకిలాల్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. తండా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ మార్కెట్ చైర్మన్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేసి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.1001180494.jpg

You may also like...