నీట్ లో సత్తా చాటిన నిరుపేద బిడ్డ – అండగా నిలిచిన జోగయ్య
- నీట్ లో సత్తా చాటిన నిరుపేద బిడ్డ – అండగా నిలిచిన జోగయ్య - September 15, 2026
- వెల్దండ గర్వకారణం వివేక్ – భవిష్యత్తులో మంచి వైద్యుడిగా ఎదగాలి: సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ - September 15, 2026
- వెల్దండ మండల వ్యాప్తంగా వెల్లువిరిసిన గణపతి పూజా కార్యక్రమాలు - September 14, 2026
వెల్దండ సెప్టెంబర్ 15: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రానికి చెందిన గుద్దేటి శేఖర్ – అలివేల దంపతుల కుమార్తె గుద్దేటి సరిత ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది.నిరుపేద కుటుంబానికి చెందిన సరిత ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు కానుగుల జోగయ్య సరితను ఇంటికి వెళ్లి ఘనంగా సన్మానించారు. పై చదువుల కోసం రూ.5,000/- ఆర్థిక సహాయం అందజేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో మంచి మాజీ ఎంపీటీసీ లింగం, ప్రభాకర్, జంగిలి నిరంజన్, వార్డు సభ్యులు శేఖర్,జంగాచారి, నారాయణరెడ్డి,జగన్, రవికుమార్, వెంకటయ్య, సురేష్ గ్రామ పెద్దలు, బీఆర్ఎస్ నాయకులు,కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సరిత భవిష్యత్తులో మంచి వైద్యురాలిగా ఎదగాలని ఆకాంక్షించారు.
