రోడ్డుపై వరి నాటు వేసి నిరసన తెలిపిన యువకులు


జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 02 : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్ర నుంచి కంటోనిపల్లి బయలుదేరే రోడ్డుపై ఏర్పడిన భారీ గోతులలో ఆదివారం యువకులు వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి సీతక్క స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గారితో కలిసి శంకుస్థాపన చేసి సంవత్సరం గడుస్తున్న పనులు ప్రారంభం కాకపోవడంలేదని యువకులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్ అంతా బురద మయంగా మారి, నడవడానికి కూడా వీలు లేకుండా అధ్వానంగా మారిందని ఆరోపించారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్లిన పరిష్కరించకపోవడంతో వరి నాట్లు వేసి నిరసన తెలిపామన్నారు. స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ని ఇదే విషయంపై చరవాణి ధర సంప్రదించగా కాంట్రాక్టర్ తో మాట్లాడి పనులు ప్రారంభమయ్యాలా చూస్తానని దాటవేశారని తెలిపారు ఇప్పటికైనా రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శివప్రసాద్, యువకులు తేజ రాజు ప్రవీణ్ రాము శివ వెంకటేష్ తదితరులు ఉన్నారు.

You may also like...