వెన్నెల!
- సాయి నగర్లో భక్తిశ్రద్ధలతో గణనాథుడి పూజలు - September 19, 2026
- చౌడర్గూడలో TOSS ప్రవేశాల ప్రచారం - September 19, 2026
- హెచ్-1బీపై 1 లక్ష డాలర్ల ఫీజు కొనసాగింపు - September 19, 2026

ఈ వెన్నెల్లు
ఏం చేసుకోను?
మంచును పిండి చేసి వెదజల్లిన
ఈ వెన్నెల్లు ఏం చేసుకోను?
మల్లెలన్నీ జల్లెడేసి విరబూసిన
ఈ వెన్నెల్లు ఏం చేసుకోను?
దారి పొడవునా,వీధి వీధినా
ఆకుల సందుల్లో, చల్లని పందిరిలా
ఈ వెన్నెల్లు ఏం చేసుకోను?
కళ్ళల్లో కురిసిన వెన్నెల
ఇళ్లపై పరచిన వెన్నెల
ఇంతి పూబంతి కన్నుల
ఇన్నాళ్లూ తడిపింది నన్నిలా
ఈ వెన్నెల్లు ఏం చేసుకోను?
కాగితంలో ఒలికిన వెన్నెల
జీవితంలో చిలికెను వెన్నలా
ఈ వెన్నెల ఏం చేసుకోను
తన పలువరసన మెరిసెనా
తన శిగ సరసన మురిసెనా
తన పదాల ముకుళించెనా
తన పెదాల రవళించెనా
ఏం చేసుకోను ఈ వెన్నెల!!?
—- దండమూడి శ్రీచరణ్
9866188266
