MRPS సీనియర్ నాయకుడు బడే దాసు మృతి
- రుతుక్రమ ఆరోగ్యంపై సుప్రీం ఆగ్రహం! - October 18, 2026
- ఓటర్ల జాబితాలపై కాంగ్రెస్ విజయం! - October 18, 2026
- బండమేది వెంకటేష్ ఆధ్వర్యంలో మనీషా అనంత్ రెడ్డి కి ఘన సత్కారం
- October 18, 2026

శంకర్‌పల్లి మండలం మొకిలా గ్రామానికి చెందిన MRPS సీనియర్ నాయకుడు బడే దాసు బుధవారం రాత్రి మృతి చెందారు. ఆయన MRPSలో చురుకుగా పాల్గొంటూ సామాజిక ఉద్యమ కార్యక్రమాల్లో తనవంతు పాత్ర పోషించారు. ఆయన మృతి పట్ల MRPS నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బడే దాసు మృతి MRPS శ్రేణులకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన అంత్యక్రియలు నేడు మధ్యాహ్నం 12 గంటలకు మొకిలాలోని స్వగృహం వద్ద నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై బడే దాసుకు తుది నివాళులు అర్పించనున్నారు
