కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ నిరసన
- కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ నిరసన - September 2, 2026
- ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి, సీఈఓ సుదర్శన్‌రెడ్డి - September 2, 2026
- ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ వర్ధంతి వేడుకలు - September 2, 2026

రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు ఇంద్రారెడ్డి ప్రధాన చౌరస్తా వద్ద కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీల ఫ్లెక్సీతో ఆందోళన చేపట్టారు. అలాగే ‘ఇంటింటికీ బాకీ కార్డు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని నాయకులు విమర్శించారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీల్లో అనేకం నెరవేర్చలేదని ఆరోపించారు. హామీలను అమలు చేసే వరకు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు గోవర్ధన్‌రెడ్డి, నర్సింలు, సీనియర్ నాయకులు వాసుదేవ్ కన్నా, మాణిక్‌రెడ్డి, సర్పంచులు రాఘవేందర్‌రెడ్డి, ఇంద్రాసేనారెడ్డి, ఎరుకల శేఖర్, కౌన్సిలర్లు విజయ్‌కుమార్, మహేందర్‌రెడ్డి, ప్రశాంత్, మాజీ కౌన్సిలర్ శ్రీనాథ్, మాజీ సర్పంచులు శ్రీధర్, నర్సింహరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బద్దం సురేందర్‌రెడ్డి, అడ్వకేట్ ఉపేందర్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ సీనియర్, యువజన, మైనారిటీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
