తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం, సమగ్ర ప్రగతి పత్రాల అందజేత

ప్రాథమిక పాఠశాల మన్మర్రిలో ఈరోజు నిర్వహించిన పేరెంట్–టీచర్ సమావేశం సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మర్పల్లి అశోక్ మాట్లాడుతూ, ఇటీవల పాఠశాలలో విద్యార్థులకు నిర్మాణాత్మక మదింపు, మరియు సంగ్రహణాత్మక మదింపు పరీక్షలకు సంబంధించిన ఫలితాలను సమగ్ర ప్రగతి పత్రాలలో నమోదు చేసి వాటిని తల్లిదండ్రుల సమావేశంలో వివరించి విద్యార్థులకు అందజేయడం జరిగింది. విద్యార్థుల విద్యా ప్రగతితో పాటు వారి వ్యక్తిగత, సామాజిక, మానసిక, సృజనాత్మక మరియు నైపుణ్యాభివృద్ధిని సమగ్రంగా అంచనా వేయడమే ఈ సమగ్ర ప్రగతి పత్రాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
విద్యార్థులలోని ప్రతిభ, అభ్యసన సామర్థ్యాలు, ప్రవర్తన, సృజనాత్మకత, ఆటపాటలు తదితర అంశాలను తల్లిదండ్రులు తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రెస్ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేసినప్పుడే విద్యార్థుల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లల అభ్యసన ప్రగతిని పరిశీలించి, ఇంటి వద్ద కూడా చదువులో తగిన ప్రోత్సాహం అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు మర్పల్లి అశోక్,ఉపాధ్యాయులు సత్యం,శ్రీలత, వెంకటేశ్వరి, అనురాధ, చంద్రకళ, మరియు తల్లిదండ్రులు రంగాపురం వెంకటేష్, విజయ్ కుమార్,
ఈదయ , నర్సింలు, షాబుద్దీన్, దర్శన్,రవి, గాలయ్య, సతీష్,బీరయ్య, లక్ష్మి,అనురాధ, నరసమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.

You may also like...