శంషాబాద్‌లో ఘనంగా పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం

383447.jpg

రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్సీ (MCL) గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది. తెలంగాణ రక్షణ సేన పార్టీ స్థానిక నేత, టిఆర్ఎస్ (TRS) పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇంచార్జ్ బృందం ఆధ్వర్యంలో నీరుడు సర్వేష్ ముదిరాజ్ ఈ ప్రత్యేక నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.

అర్హులైన పట్టభద్రులందరికీ ఓటరు నమోదుపై అవగాహన కల్పిస్తూ, వారు ఈ ప్రక్రియలో పాల్గొనేలా నిర్వాహకులు ప్రోత్సహిస్తున్నారు. ఈ సందర్భంగా నీరుడు సర్వేష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్క అర్హుడి భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో "జై తెలంగాణ, జై కవితమ్మ" అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.

You may also like...