మండల కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎండీ ఇబ్రహీం నియామకం
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

జ్ఞానతెలంగాణ, సిద్దిపేట్:
నారాయణరావుపేట్ మండల కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా జక్కాపూర్ గ్రామానికి చెందిన ఎండీ ఇబ్రహీంను నియమించినట్లు డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్ తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మజార్ మాలిక్, డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్ చేతుల మీదుగా ఎండీ ఇబ్రహీంకు నియామక పత్రం అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కట్టుబడి పనిచేయాలని సూచించారు. మండలంలో పార్టీని మరింత బలోపేతం చేసి, మైనారిటీలకు పార్టీ సిద్ధాంతాలను చేరవేయాలని పిలుపునిచ్చారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎండీ ఇబ్రహీం మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన జిల్లా అధ్యక్షుడు మజార్ మాలిక్, డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధి, మైనారిటీ వర్గాల సాధికారత కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎండీ గౌస్, రాగుల అశోక్ గౌడ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
