గృహ లక్ష్మీ పథకం రద్దు.
- శంకర్పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - August 16, 2026
- రాష్ట్రపతి భవన్లో ఘనంగా ఎట్ హోమ్ రిసెప్షన్ - August 15, 2026
- అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు - August 15, 2026

గృహ లక్ష్మీ పథకం రద్దు.
హైదరాబాద్ జనవరి 03: గత ప్రభుత్వ పథకమైన గృహలక్ష్మీ పథకాన్ని ఉపసంహకరిస్తూ నూతన కాంగ్రెస్ ప్రభుత్వం జివో జారీ చేసింది.గృహలక్ష్మీ పథకం కింద నాలుగు లక్షల ఇళ్లకు మూడు లక్షల ఆర్థిక సహాయం 100 శాతం సబ్సిడితో అందజేసేందుకు గత ప్రభుత్వం నిర్దేశించింది.ఇందుకు సంబంధించి 2,12,095 మంది లబ్ది దారులకు శాంక్షన్ ఆర్డర్లను ఆయా జిల్లా కలెక్టర్లు మంజూరు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం పేరిట ఆరు గ్యారంటీలలో ఇందిరమ్మ ఇళ్ల పేరిట జాగా వున్న పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ఇళ్లు లేని వారికి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు నిర్ణయించింది.ఈ క్రమంలో గతంలో వున్న గృహలక్ష్మీ పథకాన్ని ఉపంస హరిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఆయా శాఖ లకు ఆదేశాలిచ్చింది.
