రాష్ట్ర ఉపసర్పంచ్‌ల సంఘం ప్రధాన కార్యదర్శిగా దుస్స కుమార్ నియామకం
- రాహుల్‌కు అవమానం..
మోదీ క్షమాపణ చెప్పాలి - July 23, 2026 - రేపే ‘జననాయగన్’ విడుదల.. - July 22, 2026
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్‌కు అగ్రస్థానం చేరువ - July 22, 2026

రాష్ట్ర ఉపసర్పంచ్‌ల సంఘం ప్రధాన కార్యదర్శిగా దుస్స కుమార్ నియామకం
జ్ఞానతెలంగాణ, స్టేట్ డెస్క్ :
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గొల్లగూడెం గ్రామ ఉపసర్పంచ్ దుస్స కుమార్‌ను ఉపసర్పంచ్‌ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర కమిటీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నియామక పత్రాన్ని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు రాములు నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కార్తిక్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో పలు జిల్లాల ప్రతినిధులు, ఉపసర్పంచ్లు పాల్గొని దుస్స కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించిన దుస్స కుమార్‌కు రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించడం సంఘం విశ్వాసానికి నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. గ్రామీణ అభివృద్ధి, పారదర్శక పరిపాలన, స్థానిక సంస్థల బలోపేతం వంటి అంశాల్లో ఆయన చూపిన నిబద్ధతను ప్రశంసించారు. ఉపసర్పంచ్‌ల హక్కులు, బాధ్యతలు, పరిపాలనా సామర్థ్యాల పెంపు దిశగా రాష్ట్రవ్యాప్తంగా సమన్వయం సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా దుస్స కుమార్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కమిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఉపసర్పంచ్‌ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం, గ్రామస్థాయిలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడం తన ప్రాధాన్యంగా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపసర్పంచ్‌ల ఐక్యతను పెంపొందిస్తూ, వారి ప్రతిష్ఠను మరింత బలపర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.
స్థానిక స్వయంపాలన వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ అభివృద్ధికి తోడ్పడటం తమ ప్రధాన లక్ష్యమని సంఘం ప్రతినిధులు వెల్లడించారు. దుస్స కుమార్ నియామకం రాష్ట్ర ఉపసర్పంచ్‌లకు నూతనోత్సాహాన్ని నింపుతుందని వారు అభిప్రాయపడ్డారు.
