పీఆర్‌టీ కారిడార్లు.. ఏడాదిలో తొలి దశ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం చూపడంతో పాటు ప్రయాణ సమయాన్ని తగ్గించి, వాయు కాలుష్యాన్ని నియంత్రించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. కోర్ అర్బన్ ఏరియా (క్యూర్‌) పరిధిలోని ప్రధాన మార్గాల్లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (పీఆర్‌టీ) వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో పీఆర్‌టీ విధానంపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. తొలిదశలో అత్యంత రద్దీగా ఉండే కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ నుంచి దుర్గం చెరువు, రహేజా…