జనగామ వాసవి కాలనీలో వైభవంగా బతుకమ్మ సంబరాలు పూల పండుగతో పులకించిన మహిళాలోకం

జనగామ వాసవి కాలనీలో వైభవంగా బతుకమ్మ సంబరాలు పూల పండుగతో పులకించిన మహిళాలోకం

శిలాఫలకంపై ఉప సర్పంచ్ పేరు లేకపోవడంతో ఎమ్మార్పీఎస్ ధర్నా

ఊర్కొండ, అక్టోబర్ 10: గ్రామపంచాయతీ నూతన భవన శిలాఫలకంపై దళిత ఉపసర్పంచ్ దుబ్బ భాగ్యరాణి పేరు చేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులు శనివారం ఇప్పపహాడ్ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రాజు మాదిగ మాట్లాడుతూ, వి.బి.-జీ రామ్‌జీ నిధులతో నిర్మించనున్న గ్రామపంచాయతీ నూతన భవనానికి భూమిపూజ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ఉపసర్పంచ్ పేరు లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దళితురాలు కావడం వల్లే ఆమె పేరును చేర్చలేదా అనే…

హద్దురాళ్ల తొలగింపు పై ప్లాట్ల కొనుగోలుదారుల ఆందోళన.. పునరుద్ధరిస్తామని నిర్వాహకుడి హామీ

హద్దురాళ్ల తొలగింపుపై ప్లాట్ల కొనుగోలుదారుల ఆందోళనసర్పంచ్ చొరవతో స్పందన.. మూడు, నాలుగు రోజుల్లో పునరుద్ధరిస్తామని నిర్వాహకుడి హామీవెల్దండ: ప్లాట్ల హద్దురాళ్ల తొలగింపు వ్యవహారం బండోనిపల్లి గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ముందస్తు సమాచారం అందకపోవడంతో కొంతమంది ప్లాట్ల కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని సర్పంచ్ ఎనుముల సంగీత శేఖర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా,ఆమె స్పందించి సమాచారం అందించడంతో కొనుగోలుదారులు కృతజ్ఞతలు తెలిపారు.వెల్దండ మండల పరిధిలోని ఉమ్మడి బొల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న బండోనిపల్లి గ్రామంలో సర్వే నంబర్లు…

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో రెవెన్యూ రీ-సర్వే పనుల పరిశీలన

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ రీ-సర్వే లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన లింగారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే పనులను జిల్లా అడిషనల్ కలెక్టర్ బి. చెన్నయ్య గారు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా సర్వేయర్లకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. సర్వే లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా కచ్చితత్వంతో పని చేయాలని ఆదేశించారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేసి, రీ-సర్వే…

నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి

వెల్దండ అక్టోబర్ 09:నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో వ్యవసాయ పొలంలోని నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉప్పనమోని శివ, పూజిత దంపతులు తమ రెండేళ్ల కుమారుడు కౌశిక్‌తో కలిసి పత్తి తీసేందుకు వ్యవసాయ పొలానికి వెళ్లారు. అక్కడ బాలుడు ఆడుకుంటూ కొంతదూరం వెళ్లి కనిపించకుండా పోయాడు. దీంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు వెతకగా,…