రిపోర్టర్, సంగారెడ్డి | 9000600737
Latest posts by MOHAMMAD MOHAMMAD
(see all) Iసంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని కొల్లూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ సొంతింట్లో తొలి దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి వారి ఇళ్ల ముందు దీపాలు వెలిగించి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. సొంతింటి కల సాకారం కావడంతో లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. తమ సొంతింట్లో తొలి దీపావళి జరుపుకోవడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.
అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్ల ముందు ఫొటోలు దిగి, వాటిని ఇందిరమ్మ ఇళ్ల యాప్‌తో పాటు సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని సర్పంచ్ సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
