యాదవుల ఆత్మగౌరవానికి, సంస్కృతికి, ప్రతీక సదర్ ఉత్సవం

యాదవుల సంస్కృతి, ఐక్యతకు ప్రతీక సదర్ ఉత్సవాలు

ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం
మూసాపేట్: యాదవుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మగౌరవం, ఐక్యతకు ప్రతీకగా నిలిచే సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని పీసీసీ సభ్యులు, టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం అన్నారు.
మూసాపేట్ యాదవ సంఘం ఆహ్వానం మేరకు నిర్వహించిన సదర్ ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదవ సోదరులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొని సందడి చేశారు. యాదవ సోదరులకు సదర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డా. సత్యం శ్రీరంగం మాట్లాడుతూ, సదర్ ఉత్సవాలు యాదవుల జీవన విధానం, పశుసంపదతో ముడిపడిన సంప్రదాయాలు, సామాజిక ఐక్యతను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని మరింత పెంపొందిస్తాయని తెలిపారు.
యాదవ సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలను ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించడం పట్ల నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో బి-బ్లాక్ అధ్యక్షుడు తూము వేణు, ఎల్లేష్ యాదవ్, నరసింహ యాదవ్, మల్లేష్ యాదవ్, కుమార్ యాదవ్, శేఖర్ గౌడ్, జుబైర్‌తో పాటు పెద్ద సంఖ్యలో యాదవ సోదరులు పాల్గొన్నారు.

You may also like...