కల్వకుర్తి యాదవ సంఘం అధ్యక్షుడిని సన్మానించిన విజేందర్ యాదవ్

1001337668.jpg

వెల్దండ:కల్వకుర్తి నియోజకవర్గ యాదవ సంఘం నూతన అధ్యక్షుడిగా వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామానికి చెందిన జక్కుల చిన్న జంగయ్య యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కల్వకుర్తి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఎన్నికను ఏకగ్రీవంగా ఖరారు చేశారు.ఈ సందర్భంగా నూనె విజేందర్ యాదవ్ జక్కుల చిన్న జంగయ్యను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. యాదవుల ఐక్యతను బలోపేతం చేయడంతో పాటు సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు ఉప్పుల మహేష్ యాదవ్, జక్కుల విజయ్ యాదవ్, బైకని నరసింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...