కల్వకుర్తి తాలూకా యాదవ సంఘం అధ్యక్షుడిగా జక్కుల చిన్న జంగయ్య ఏకగ్రీవం

1001337501.jpg

కల్వకుర్తి, నవంబర్ 07: కల్వకుర్తి తాలూకా యాదవ సంఘం అధ్యక్షుడిగా బొల్లంపల్లి గ్రామానికి చెందిన జక్కుల చిన్న జంగయ్య యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం కల్వకుర్తి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో జిల్లా యాదవ సంఘం నాయకుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయనను ఎన్నుకుని నియామక పత్రం అందజేసి సత్కరించారు.ఈ సందర్భంగా జిల్లా నాయకులు రవి యాదవ్, లాలు యాదవ్ మాట్లాడుతూ యాదవుల ఐక్యత, అభివృద్ధి కోసం సంఘటితంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నూతన అధ్యక్షుడు జంగయ్య యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. యాదవుల అభివృద్ధికి, పేద కుటుంబాల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మనీలా సంజీవ్ కుమార్ యాదవ్, పెద్దయ్య యాదవ్, రుక్కుల్ యాదవ్, రాములు యాదవ్, రాజు యాదవ్, వెంకటేష్ యాదవ్, మల్లేష్ యాదవ్, తానేష్ యాదవ్, బుడ్డం జంగయ్య యాదవ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

You may also like...