రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all) సున్నం చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన బండి రమేష్
కూకట్పల్లి, నవంబర్ 7: కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని సున్నం చెరువు అభివృద్ధి పనులను టీపీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ శనివారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. గాయత్రి నగర్ డివిజన్ అధ్యక్షుడు మస్తాన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పర్యటనలో పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. చెరువు స్థలాన్ని ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించి, సున్నం చెరువును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తోందన్నారు. వాకింగ్ ట్రాక్, భద్రత, పచ్చదనం తదితర ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పనులు పూర్తయిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రజలకు అంకితం చేస్తామన్నారు. చెరువుల ఆక్రమణలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. గాయత్రి నగర్ నుంచి 100 ఫీట్ల రోడ్డుకు అనుసంధాన రహదారిని కూడా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పుష్పారెడ్డి, వాజిద్ పాషా, వేముల సత్యం, కనకయ్య, నరసింహ, రంగమోహన్, బర్కతలి, ప్రకాష్ ముదిరాజ్, నజీర్, లడ్డు, అడ్వాని అనిల్, రమణ, రవి, పిడికిటి గోపాల్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
