సింగిల్ విండో నూతన చైర్మన్ ఎన్నం భూపతిరెడ్డికి ఘన సన్మానం

వెల్దండ1001334261.jpg

నవంబర్ 06:వెల్దండ సింగిల్ విండో నూతన చైర్మన్‌గా ఎంపికైన ఎన్నం భూపతిరెడ్డిని పోతేపల్లి గ్రామానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు,నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి అభినందించారు.ఈ కార్యక్రమంలో పోతేపల్లి మాజీ ఎంపీటీసీ కాడు రాంనాయక్, సర్పంచ్ గన్య నాయక్, మెల్కేడి రాజు,అరుణ్ నాయక్,కుమార్ నాయక్,తానేష్ యాదవ్, మల్లేష్ యాదవ్,మహేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా చైర్మన్ ఎన్నం భూపతిరెడ్డి మాట్లాడుతూ రైతాంగానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం వెల్దండ తహసీల్దార్ కార్తీక్ కుమార్‌ను కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు దరఖాస్తును అందజేశారు.

You may also like...