ఎమ్మెల్యే వేముల వీరేశంకు తృటిలో తప్పిన ప్రమాదం
- జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు దుగినవెల్లి విద్యార్థి ఎంపిక మారుమూల గ్రామం నుంచి ప్రతిభ చాటిన గోపాలకృష్ణ - November 5, 2026
- ఎమ్మెల్యే వేముల వీరేశంకు తృటిలో తప్పిన ప్రమాదం - November 5, 2026
- ఎమ్మెల్సీ ఓటు నమోదు కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు - November 5, 2026
జ్ఞాన తెలంగాణ, కట్టంగూరు, నవంబర్ 5: ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కారు ముందు, వెనుక భాగాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యేకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గురువారం శాలిగౌరారంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి నాయనమ్మ మృతి చెందడంతో ఆమెకు నివాళులర్పించి, ఎంపీని పరామర్శించారు. అనంతరం అక్కడి నుంచి చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు బయల్దేరాడు. ఈ క్రమంలో కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామ శివారులోని చెర్వు అన్నారం స్టేజీ వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ కావడంతో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు నిలిచిపోయింది. అదే సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న మరో కారు వేగంగా వచ్చి ఎమ్మెల్యే వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యే కారు ముందున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ముందు, వెనుక భాగాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఆయన అనుచరులు, వాహన సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఆయన వేరే కార్ లో చిన్నకాపర్తికి బయలుదేరి వెళ్లాడు.

