ప్రజాసేవకే అంకితమవుతా: సింగిల్ విండో డైరెక్టర్ గంగదారి మల్లేష్
- కల్వకుర్తి యాదవ సంఘం అధ్యక్షుడిగా జక్కుల చిన్న జంగయ్య యాదవ్! - November 6, 2026
- కొట్ర తండా కూడలిలో పోలీసుల ముమ్మర వాహన తనిఖీలు - November 6, 2026
- ఎస్సీ సంక్షేమ పథకాల సాధనకు ర్యాలీ.. పోలీసులకు వినతి - November 6, 2026

వెల్దండ నవంబర్ 05:సింగిల్ విండో డైరెక్టర్ గా ఎన్నికైనందుకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి,రాచూర్ గ్రామ ప్రజలకు వెల్దండ మండలం రాచూర్ గ్రామానికి చెందిన గంగదారి మల్లేష్ కృతజ్ఞతలు తెలిపారు.గురువారం ఆయన మాట్లాడుతూ..రాచూర్ గ్రామ ప్రజల ఆదరణ, ఆశీర్వాదం, భగవంతుని కృపతోనే తనకు వరుసగా అవకాశాలు లభించాయని అన్నారు. తన నాన్నగారు అయిన గంగధారి శంకరయ్యను విద్యా కమిటీ చైర్మన్ గా, తనను గ్రామ పంచాయతీ వార్డు సభ్యునిగా, తన భార్య గంగధారి శిరీషను గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలిగా గ్రామ ప్రజలు ఆదరించారని గుర్తు చేశారు.ఇప్పుడు సింగిల్ విండో డైరెక్టర్ గా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితాంతం రాచూర్ గ్రామ ప్రజలకోసమే రుణపడి ఉంటానని అన్నారు.రాజకీయాల్లో మరింత అవకాశం కల్పిస్తే నిరంతరం ప్రజాసేవకే అంకితమవుతానని గంగదారి మల్లేష్ స్పష్టం చేశారు.
