మురాసు తుఫాన్‌ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. తహసిల్దార్ కార్తీక్ కుమార్

1001323110.jpg

వెల్దండ:మురాసు తుఫాన్‌ ప్రభావంతో నవంబర్ 3 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్దండ తహసీల్దార్ బీశ్వ కార్తీక్ కుమార్ సూచించారు. సోమవారం వెల్దండ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించవద్దని, అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని హెచ్చరించారు. వర్షాల సమయంలో చెరువులు, కుంటలు, వాగుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలు పాటించాలని తహసీల్దార్ కోరారు.

You may also like...