చెందిప్ప గేట్ హనుమాన్ ఆలయం పరిసరాల్లో రసాయన పౌడర్
- చెందిప్ప గేట్ హనుమాన్ ఆలయం పరిసరాల్లో రసాయన పౌడర్ - September 23, 2026
- “విజయం ఒక్కరోజులో రాదు.. పట్టుదలతో సాగిన ప్రతి అడుగూ విజయానికి పునాది.” - September 22, 2026
- స్వర్ణ సంచలనం..లంకపై భారత్ ఘన విజయం! - September 22, 2026
చెం
చెందిప్ప గేట్ హనుమాన్ ఆలయం పరిసర ప్రాంతాల్లో గుర్తుతెలియని రసాయన పౌడర్‌ను వేస్తున్నారనే ఆరోపణలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ రసాయన పదార్థాలను జంతువులు, పక్షులు పొరపాటున ఆహారంగా భావించి తింటే వాటి ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆలయ పరిసరాలు కావడంతో భక్తులు, ప్రజలు, పశువులు, పక్షులు తరచుగా సంచరిస్తుంటారని, ఇలాంటి పదార్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.అసలు ఆ పౌడర్ ఏమిటి? దానిలో ఏ రసాయనాలు ఉన్నాయి? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అనే విషయాలపై సంబంధిత అధికారులు పరిశీలించి, అవసరమైతే నమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.జంతువులు, పక్షులకు ఎలాంటి ప్రమాదం కలగకుండా వెంటనే ఆ ప్రాంతాన్ని పరిశీలించి, రసాయన పదార్థాలను తొలగించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు
