వర్షాల వేల ప్రజల కోసం సేవ ముందస్తు చర్యలు
- వర్షాల వేల ప్రజల కోసం సేవ ముందస్తు చర్యలు - September 22, 2026
- ఎల్ నినో ప్రభావం పై అవగాహన లేకుండా బీఆర్ఎస్ నేతలు ధర్నాలు – మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీత నరసింహాం - September 22, 2026
- మృతుని కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థిక చేయూత - September 22, 2026

కోడేరు గ్రామంలో ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సర్పంచ్ నడింపల్లి మహేశ్వర్‌రెడ్డి ముందస్తు చర్యలు చేపడుతున్నారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల పరిసరాలు, ఆర్‌ఎంపీ రోడ్డు పక్క ప్రాంతాలు, ఒడ్డేవాడ కాలనీలోని మోరీలు, డ్రైనేజీలను పరిశీలించి పేరుకుపోయిన మట్టి, చెత్తను జేసీబీ సహాయంతో తొలగిస్తున్నారు. వర్షపు నీరు సజావుగా వెళ్లేలా అవసరమైన ప్రాంతాల్లో శుభ్రత పనులు చేపడుతున్నారు. గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరిస్తున్న సర్పంచ్ తీరుపై గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
