ఆమనగల్లులో వినాయక మండపంలో మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
- ఆమనగల్లులో వినాయక మండపంలో మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు - September 22, 2026
- త్రిదలన్ యూత్ గణనాథుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సునేంద్ర కుమార్ - September 22, 2026
- చారగొండ మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ - September 22, 2026
ఆమనగల్లు, సెప్టెంబర్ 22: ఆమనగల్లు మున్సిపాలిటీ 9వ వార్డు పోస్ట్ ఆఫీస్ కాలనీలో బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ యడ్మ సత్యం, సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్, కౌన్సిలర్లు పాపిశెట్టి రాము, ఎర్రవోలు మహేష్, నాగిళ్ల జగన్, కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ ఖాదర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుత్తి బాలస్వామి అతిథులను శాలువాలతో 
సత్కరించారు. అనంతరం మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బజరంగ్ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
