మహా పాదయాత్రకు మద్దతుగా భారీగా తరలివస్తాం – ఎర్రవల్లి భూనిర్వాసితులు

ఎర్రవల్లి భూ నిర్వాసితుల ఆందోళన 295వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో దీక్షా స్థలంలో సంఘీభావ కార్యక్రమం నిర్వహించారు.ఈ నెల 27న ఉల్పర నుంచి కల్వకుర్తి వరకు చేపట్టనున్న మహా పాదయాత్రకు సంబంధించి దీక్షా స్థలంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి భూ నిర్వాసితులు మాట్లాడుతూ.. తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టనున్న మహా పాదయాత్రకు బాధితులుగా పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలుపుతామని పేర్కొన్నారు.

అనంతరం అజిలాపూర్, ఇర్విన్ గ్రామాల్లో మహా పాదయాత్రకు సంబంధించిన సన్నాహక సమావేశాలు నిర్వహించారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, రాఘవాచారి, ఖలీల్తో పాటు ఎర్రవల్లి భూ నిర్వాసితులు పాల్గొన్నారు.1001202497.jpg

You may also like...