ఎఫ్ ఎస్ ఆర్ హాజరు ఆధారంగానే వచ్చే నెల నుంచి జీతాలు.. కలెక్టర్

1001200256.jpg

నాగర్‌కర్నూల్ జిల్లా: వచ్చే నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు ఆధారంగానే చెల్లించనున్నట్లు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు.జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందికి ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు తప్పనిసరి అని స్పష్టం చేశారు. హాజరు నమోదులో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ నెలాఖరులోగా ఎఫ్‌ఆర్‌ఎస్‌ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఎఫ్‌ఆర్‌ఎస్‌ ద్వారా హాజరు నమోదు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

You may also like...