గణేష్ మండపాల వద్ద అన్నదానం

గణేష్ మండపాల వద్ద అన్నదానం

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 20 : మండలంలోని మల్లారం, కట్టంగూర్, నారెగూడెం, ఈదులూరు, ముత్యాలమ్మగూడెం, అయిటిపాముల గ్రామాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు ఆదివారం మండపాల వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లు ముక్కామల శ్యామల శేఖర్, పెద్ది నాగమణి మల్లేష్, కురిమిల్ల మల్లేష్, బెల్లి సుధాకర్, మాజీ ఉప సర్పంచ్ అంతటి శ్రీను, వార్డు సభ్యులు సంధ్య. నాగేశ్వేర్ రావు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు కోమటి భాస్కర్, రెడ్డిపల్లి సైదులు, కొండ వెంకన్న, వంగాల నగేష్, తదితులు పాల్గొన్నారు.1000352554.jpg

You may also like...