గుంతలే గతి.. శంకర్‌పల్లి రోడ్లపై అధికారుల నిర్లక్ష్య పరాకాష్ట!

1012709185.jpg

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి ప్రధాన కూడలి ఇంద్రారెడ్డి చౌరస్తా వద్ద రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. చౌరస్తా వద్ద భారీ గుంతలు ప్రమాదాలకు బహిరంగ ఆహ్వానం పలుకుతున్నా అధికారులకు మాత్రం పట్టినట్టే లేదు. గుంతలను తప్పించుకునేందుకు వాహనదారులు రోడ్డుపై అడ్డంగా మళ్లుతుండటంతో ఎదురుగా వచ్చే వాహనాలతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనన్న భయం నెలకొంది. ప్రజలు నిత్యం నరకయాతన పడుతున్నా అధికారుల నిర్లక్ష్యం మాత్రం హద్దులు దాటుతోంది. ప్రమాదం జరిగి ప్రాణాలు పోయిన తర్వాతే మేల్కొనే పాలన ఎందుకని? అని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా గాఢనిద్ర వీడి గుంతలను తక్షణమే పూడ్చి ప్రమాదాలను నివారించాలని డిమాండ్ చేస్తున్నారు.

1012709186.jpg

You may also like...