చొక్కన్నపల్లి మాదిగల మానవతా సహాయం రూ. 28500/-అందజేత
- మట్టి వినాయకుడిని పూజిద్దాం – పర్యావరణం కాపాడుదాం: గోలి శ్రీనివాస్ రెడ్డి - September 13, 2026
- చొక్కన్నపల్లి మాదిగల మానవతా సహాయం రూ. 28500/-అందజేత - September 13, 2026
- మట్టి గణపతులకు పట్టం – లోగోను ఆవిష్కరించిన సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ - September 13, 2026
వెల్దండ మండలం:చొక్కన్నపల్లి గ్రామానికి చెందిన కొమ్ము చిన్న నాగయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో చొక్కన్నపల్లి మాదిగల ఐక్యవేదిక సభ్యులు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు.మాదిగల ఐక్యవేదిక సభ్యులందరి సహకారంతో జమ చేసిన రూ. 28,500/- రూపాయలను మృతుని భార్యకు అందజేశారు. ఆపత్కాల సమయంలో అండగా నిలిచి ఆర్థిక సాయం అందించడం పట్ల మండల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది గొప్ప మానవతా దృక్పథమని కొనియాడుతున్నారు.ఈ కార్యక్రమంలో మాదిగల మండల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కొయ్యల పుల్లయ్య సభ్యులు నాగయ్య, జగదీష్, శ్రీను, ఈదులపల్లి వెంకటయ్య, శ్రీనివాసులు, మల్లేష్ తదితరులతో పాటు మాదిగల ఐక్యవేదిక గ్రామ కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు.
చిన్న నాగయ్య కుటుంబానికి పెద్దమనసుతో అండగా నిలిచిన చొక్కన్నపల్లి మాదిగల ఐక్యవేదిక తీసుకున్న నిర్ణయాన్ని సర్వత్రా అభినందిస్తున్నారు.
