యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి‌‌.. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

కల్వకుర్తి సెప్టెంబర్ 06:యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని ఐక్యత పౌండేషన్ చైర్మన్ టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి సీసీటీ కెమెరా సొల్యూషన్స్ కమ్యూనికేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతనంగా వ్యాపార, ఉద్యోగాల కోసం ఎదురుచూడటంతో పాటు,స్వయం ఉపాధిని ఎంచుకుని మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి యువత ఎదగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆర్.పి.ఎం సిసి టీవీ కెమెరా సొల్యూషన్స్,నిర్వాహకులు రమేష్ & చాయ్ దోస్తీ టీ షాప్ నిర్వాహకులు మహేందర్లకు శుభాకాంక్షలు తెలిపుతూ వ్యాపారాలు విజయవంతం కావాలని ఆకాక్షించారు.ఈ కార్యక్రమాలలో పీఏసీస్ డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా,సీనియర్ నాయకులు కంబళ్ళ పరమేష్,ఉప సర్పంచ్ మహేష్, ఫౌండేషన్ సభ్యులు రఘు,ఎగిరిశెట్టి లింగం, కొండల్ యాదవ్, శ్రీపతి, సాయి తదితరులు పాల్గొన్నారు.

You may also like...