వైభవోపేతంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం

వైభవోపేతంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం

కల్వకుర్తి సెప్టెంబర్ 05: వెల్దండ మండల కేంద్రంలోని బుధవార్‌పేట ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో కనులపండువగా నిర్వహించారు.వేదపండితుల మంత్రోచ్ఛారణలు,మంగళవాయిద్యాల నడుమ వెంకటేశ్వర స్వామివారి కల్యాణ వేడుకలు వైభవంగా సాగాయి పూరి రాంప్రకాష్ దంపతులు కల్యాణోత్సవాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి డీసీసీ ఉపాధ్యక్షులు ఎన్నం భూపతిరెడ్డి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా మాజీ అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ సర్పంచ్ మట్ట యాదమ్మ, వెంకటయ్యగౌడ్ హాజరై కల్యాణోత్సవాన్ని తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రజలందరిపై వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పూరి చిన్న బాలరాజు కాంట్రాక్టర్ శశిపాల్ రెడ్డి డాక్టర్ హరికాంత్ రెడ్డి నక్కర కంటి శ్రీనివాసులు వై కృష్ణారెడ్డి ఉప్పు ఆంజనేయులు పురుషోత్తం చారి శ్రీనివాసులు తిరుపతిరెడ్డి మట్ట మధుసూదన్ గౌడ్ శ్రీశైలం ఉప్పు బాలస్వామి ఉప్పు శ్రీనివాసులు సంతోష్ కుమార్ తోపాటు భక్తులు తదితరులు ఉన్నారు.

You may also like...