అడుగడుగునా గుంతలు.. రాకపోకలకు అవస్థలు.. 20 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డుకు మరమ్మతులు కరువు శిథిలమైన కురుమర్తి రోడ్డు…
- డిజిటల్ క్రాప్ సర్వేకు రైతులు సహకరించాలి - September 7, 2026
- ప్రాణాపాయంలో ఉన్న వానరానికి మానవత్వంతో ప్రథమ చికిత్స - September 7, 2026
- అడుగడుగునా గుంతలు.. రాకపోకలకు అవస్థలు.. 20 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డుకు మరమ్మతులు కరువు శిథిలమైన కురుమర్తి రోడ్డు… - September 7, 2026
అడుగడుగునా గుంతలు.. రాకపోకలకు అవస్థలు..
20 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డుకు మరమ్మతులు కరువు
శిథిలమైన కురుమర్తి రోడ్డు…
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 06: కట్టంగూర్ నుంచి కురుమర్తి కి వెళ్లే రోడ్డు ద్వంసం కావడంతో వాహనదారులు ఇక్కట్లు వడుతున్నారు. 8 కిలో మీటర్ల మేర అడుగడుగునా గుంతలు పడి అధ్వానంగా మారింది. దీంతో ఈరోడ్డుపై వెళ్లాలంటే వాహనదారులు జంకుతున్నారు. రాత్రిపూట అయితే నరకం చూడాల్సిందే అని భయాందోళన చెందుతున్నారు. సుమారు 20 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన్ కింద కట్టంగూర్ నుంచి కురుమర్తికి బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. రోడ్డు ద్వంసం కావడంతో ఓ సారి తూతూ మంత్రంగా మరమ్మత్తులు చేపట్టి చేతులుదుపుకున్నారు. రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో మండలంలోని గార్లబాయిగూడెం, తేలువారిగూడెం గ్రామాలతో పాటు శాలిగౌరారం మండలం ఆకారం, వల్లాల, గురజాల గ్రామాలకు చెందిన ప్రజలు నిత్యం కురమర్తి గ్రామం మీదుగా కట్టంగూర్ కూ రాకపోకలు సాగించాలంటే జంకుతున్నారు. పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో రెండువాహనాలు ఎదురెదురుగా వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. సత్యనారాయణపురం, కురుమర్తి శివారులో రోడ్డు మద్యలో గోతులు పడడంతో అందులో పడి ఎంతో మంది ద్విచక్రవాహనదారులకు గాయాలయ్యాయి. రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని పలుమార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు విన్నవించిన ఫలితం లేకుండా పోయిందని ఆయా గ్రామాల ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేయాలి : బీరెల్లి రామచంద్రయ్య మాజీ ప్రజాప్రతినిధుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు
నిత్యం రద్దీగా ఉంటే కట్టంగూర్ నుంచి కురుమర్తికి వెళ్లే రోడ్డును పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలి. గత 20 సంవత్సరాల క్రితం నిర్మించి రోడ్డు వర్షాలకు ద్వంసం అయి రోడ్డుపై గుంతలు పడి ప్రమాదాలకు నిలయంగా మారింది. గత ఐదు సంవత్సరాల నుంది వాహనదారులు రోడ్డు పై ప్రయాణించాలంటే భయాంతోళన చెందుతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం స్పందించి కట్టంగూర్, శాలిగౌరారం మండల ప్రజల నిత్యం రాకపోకలు సాగించే ఈ రోడ్డుకు నిధులు మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలి

