జాతీయ ఫ్యామిలీ ప్రయోజన చెక్కు అందజేత


జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగష్టు 18:కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి,పోతేపల్లి సర్పంచ్ తగుళ్ల యాదవ్ అన్నారు.ఇటీవల బైకని యాదయ్య, ఎర్రకాలి కేశవులు మరణించిన వారికి నేషనల్ ఫ్యామిలీ బెన్ఫిట్ స్కీమ్ కింద మంజూరైన రూ.20 వేల రూపాయల చెక్కును మంగళవారం బాదిత కుటుంబానికి అందజేశారు. నిరుపేద కుటుంబాల యజమానులు 18 నుంచి 59 సంవత్సరాల వారు మరణించిన ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు.కార్యక్రమంలో వార్డు సభ్యులు, యువ నాయకులు ముంత మల్లేష్ యాదవ్, , మార్కండేయుడు, ఎగిరిశెట్టి శివకుమార్, ఎర్ర సైదయ్య అంజి యాదవ్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

You may also like...