స్వాతంత్ర్య దినోత్సవానికి ముమ్మర ఏర్పాట్లు:ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్
- చదువుతోనే తలరాత మారుతుంది - August 14, 2026
- రాజ్యాంగాన్ని గౌరవిద్దాం:రాష్ట్రపతి ద్రౌపది ముర్ము - August 14, 2026
- ప్రజావాణికి పకడ్బందీ కార్యాచరణ - August 14, 2026

జ్ఞానతెలంగాణ, శంకర్పల్లి: శంకర్పల్లి మండలంలో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు మండల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీడీఓ వి. ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో కార్యక్రమ ఏర్పాట్లను చేపట్టారు. ఆగస్టు 15న ఉదయం 8:15 గంటలకు మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. మండలంలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, గ్రామస్థాయి అధికారులు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు, పాత్రికేయులు, వివిధ శాఖల సిబ్బంది కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని అధికారులు కోరారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ జాతీయ పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్ సూచించారు.
