Daily Archive: November 2, 2026
వెల్దండ నవంబర్ 01: వెల్దండ మండలంలోని రాగాయపల్లి గ్రామపంచాయతీ పరిధి నాగరావుపల్లి తండాలో గుప్తనిధుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపినట్లు వెల్దండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఈ నెల 29న ఉదయం తన పొలానికి వెళ్లిన ఇస్లావత్ శీను.. చిన్న రాళ్లగుట్టపై ఉన్న శివలింగం పక్కన సుమారు ఐదు అడుగుల లోతులో గుంత తవ్వి తిరిగి పూడ్చిన ఆనవాళ్లను గుర్తించారు.ఈ ఘటన ఈ నెల 28న రాత్రి జరిగి ఉంటుందని అనుమానిస్తూ గ్రామ పెద్దలతో చర్చించిన…
కామారెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్-1861 అమలు చేస్తున్నట్లు SP రాజేశ్ చంద్ర తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో చదువుకోవాలని ఎస్సై నవీన్ చంద్ర సూచించారు. ఆదివారం పోలీస్టేషన్లో ఓపెన్హాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల విధులు, ఆయుధాల వినియోగం, సమాజంలో పోలీసుల పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల పరిధిలోని టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని టూరిస్ట్ బస్సు అతివేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 19 మందికి గాయాలయ్యాయి. బీర్కూరు మండలం బైరాపూర్కు చెందిన పలువురు వివాహ వేడుకలకు సూర్యాపేటకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలోని కస్తూర్బా గాంధీ పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థినులు వెళ్లిపోయారు. తరగతి గదిలో హాజరు తీసుకుంటుండగా వారు కనిపించకపోవడంతో హెచ్ఎం గీత పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై భార్గవ్ గౌడ్ విచారణ చేపట్టి బస్సులో వెళ్తున్న విద్యార్థినులను గుర్తించి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. హాస్టల్లో ఉండటం ఇష్టం లేదని వారు చెప్పడంతో తల్లిదండ్రులకు అప్పగించారు.
ఉపాధ్యాయులు సమాజానికి దిశా నిర్దేశం చేసే వ్యక్తులుగా ఎదగాలి : మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలి: మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్ లో టీఎస్ యూటీఎఫ్ 7వ జిల్లా మహాసభలు ప్రారంభంకట్టంగూర్, నవంబర్ 1: ఉపాధ్యాయులు కేవలం విద్యార్థులకు పాఠ్యాంశాలనే బోధించే వారిగా కాకుండా సమాజానికి దిశానిర్దేశం చేసే వ్యక్తులుగా ఎదగాలని మాజీ ఎమ్మెల్యే, ప్రొఫెసర్ నాగేశ్వర్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎన్ యూటీఎఫ్)…
స్నేహితుడి కుటుంబానికి ఆర్థికసాయం అందజేతజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ : అనారోగ్యంతో మృతిచెందిన తమ తోటి విద్యార్థి కుటుంబానికి ఆర్ధికసాయం అందించి మానవత్వం చాటుకున్నారు కట్టంగూర్ ఆదర్శ గురుకుల విద్యాలయ 2004-05 పదో టెన్త్ బ్యాచ్ విద్యార్థులు. పాఠశాలలో చదువుకున్న నల్లగొండ మండలం దండంపల్లి గ్రామానికి చెందిన మల్లెబోయిన వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పూర్వ ప్రిన్సిపాల్ కొంక ప్రవీణ్, కరస్పాండెంట్ బుడిగ సైదులు స్పందించి విద్యార్థులు, ఇతర దాతల సహాకారంతో రూ.65,300 సేకరించారు….
ప్లాటినం ఐకాన్ అవార్డు గ్రహీత లక్ష్మయ్యకు సన్మానంజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ : మండల కేంద్రంలోని శ్రీసాయి మణికంఠ ఆలయ గురుస్వామి వంగూరి లక్ష్మయ్య (పూలస్వామి) ఇటీవల న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మక ప్లాటినం ఐకాన్ అవార్డు అందుకున్నాడు. ఆదివారం మండలంలోని కురుమర్తి గ్రామానికి చెందిన గురుస్వామి గండమల్ల అంతయ్య ఆధ్వర్యంలో లక్ష్మయ్య నివాసానికి వెళ్లిన గురుస్వాములు ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా అంతయ్య మాట్లాడుతూ లక్ష్మయ్య ప్లాటినం అవార్డు అందుకోవడం అభానందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన…