శివలింగం వద్ద గుప్తనిధుల కోసం తవ్వకాలు:గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు

వెల్దండ నవంబర్ 1001319373.jpg

01: వెల్దండ మండలంలోని రాగాయపల్లి గ్రామపంచాయతీ పరిధి నాగరావుపల్లి తండాలో గుప్తనిధుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపినట్లు వెల్దండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఈ నెల 29న ఉదయం తన పొలానికి వెళ్లిన ఇస్లావత్ శీను.. చిన్న రాళ్లగుట్టపై ఉన్న శివలింగం పక్కన సుమారు ఐదు అడుగుల లోతులో గుంత తవ్వి తిరిగి పూడ్చిన ఆనవాళ్లను గుర్తించారు.ఈ ఘటన ఈ నెల 28న రాత్రి జరిగి ఉంటుందని అనుమానిస్తూ గ్రామ పెద్దలతో చర్చించిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్దండ ఎస్సై గంగిరెడ్డి యుగేందర్ రెడ్డి తెలిపారు.

You may also like...