సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఉద్యోగం.
- సర్కారీ బడుల్లో విస్తృత తనిఖీలు - August 11, 2026
- ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలిక మృతి - August 11, 2026
- సాన్జోస్లో క్వాంటమ్స్కేప్ సీఈఓతో భేటీ - August 11, 2026

సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఉద్యోగం.
ప్రజావాణి కార్యక్రమం ద్వారా రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం స్థానికత కారణం చూపుతూ గత ప్రభుత్వం ఉద్యోగ నిరాకరణ
రాచకొండ పోలీసు కమిషనరేట్ అంబర్ పేట పోలీసు హెడ్ హెడ్ క్వార్టర్స్ లో సొంగా శేఖర్ విధులు నిర్వర్తిస్తూ 2021 సెప్టెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.
అతని భార్య సత్యలత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందడంతో స్థానికత కారణం చూపుతూ రెండేళ్లుగా ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి గత ప్రభుత్వం నిరాకరించగా బాధితులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజావాణి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ కుటుంబ దీనస్థితిని తెలపగా, సత్వరమే స్పందించిన ముఖ్యమంత్రి మానవతా దృక్పథంతో నిబంధనలు సడలించి ఉద్యోగం ఇవ్వాలని రాష్ర్ట డీజీపీ, రాచకొండ సిపి లకు ఆదేశాలు జారీ చేశారు.
