ఇఫ్తార్ విందు సోదర భావాన్ని పెంపోందిస్తుంది : ఆశీర్వాదం
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

ఇఫ్తార్ విందు సోదర భావాన్ని పెంపోందిస్తుంది : ఆశీర్వాదం
ఇఫ్తార్ విందు సోదర భావాన్ని పెంపోందిస్తుంది అని యం ఈ ఎఫ్ సలహా దారుడు ఆశీర్వాదం అన్నారు. నిన్న శంకర్ పల్లి లో ముస్లిం ఉపాధ్యాయులు ఐనా అక్బర్ (యం ఈ ఓ),సలీం పాషా(టి యు TUWJ (IJU) రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు,ఆరీఫ్, ఆశ్రఫ్ ఖాన్,తహర్, రియాజ్ లకు మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ పక్షాన ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది.
కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఆనాటి నుండి మాదిగలు, ముస్లిమ్ లు సోదరాభావం తో అన్నదమ్ముళ్లగా కలిసి ఉన్నామని హిందూ ముస్లిమ్ పండుగలను కలిసి మెలిసి చేసుకునే వాళ్ళమని యం ఈ ఎఫ్ సోదరులు మాకు అతీద్యం ఇవ్వడం ఆనంద దయాకమని అన్నారు.
కార్యక్రమం యం ఈ ఎఫ్ మండలం అధ్యక్షులు జామ కుషాల్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, కోశాధికారి కిష్టయ్య,సలహా దారులు గోపాల్ (గవర్నమెంట్ హెడ్ మాస్టర్),లక్ష్మయ్య (గవర్నమెంట్ హెడ్ మాస్టర్),అశోక్ పోలీస్ కాన్స్టేబుల్, జంగన్న,లక్ష్మణ్,పర్మన్న,శ్రీనివాస్ లు పాల్గొన్నారు



