ఒకే రోజు 11 మంది మహిళలకు సీనియర్ అడ్వొకేట్ హోదా
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

ఒకే రోజు 11 మంది మహిళలకు సీనియర్ అడ్వొకేట్ హోదా
దేశ అత్యున్నత న్యాయస్థానం ఇవాళ చరిత్ర సృష్టించింది. 7 దశాబ్దాలలో 12 మంది మహిళా లాయర్లకు సీనియర్ అడ్వొకేట్ హోదాను సుప్రీంకోర్టు కల్పించగా, ఇవాళ ఒక్క రోజే 11 మందికి అందించింది. వారిలో శోభా గుప్తా, స్వరూపమా, లిజ్ మాథ్యూ, కరుణ, ఉత్తరా బబ్బర్, హరిప్రియ, అర్చన పాఠక్, షిర్రిన్, నప్పినై, జనని, నిషా బాగ్చి ఉన్నారు. CJI చంద్రచూడ్ నేతృత్వంలోని కమిటీ మొత్తం 56 మందికి సీనియర్ అడ్వొకేట్ హోదాను కల్పించింది.
