మృతుడి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థిక సహాయం
- ఎస్ఐఆర్ మంటలు..సీఈసీపై అభిశంసన సమరశంఖం - September 24, 2026
- ఫేతేపూర్ ఫ్లైఓవర్‌పై భద్రత ఎక్కడ..? - September 24, 2026
- రెండు డీఏలకు ప్రభుత్వం ఓకే - September 24, 2026

జ్ఞాన తెలంగాణ,కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి,ఆగస్టు 10:
వెల్దండ మండలం అజాలాపురం గ్రామానికి చెందిన జానీ మియా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. ఉదారత చాటుతూ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు,మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మృతుని కుటుంబానికి తక్షణ ఆర్థిక కసహాయం రూ.3వేలు, గ్రామ టిఆర్ఎస్ కార్యకర్తలు మొత్తం రూ.1000 రూపాయలు మొత్తం రూ.4 వేల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు,సర్పంచ్ సిద్ధగోని రమేష్ గౌడ్,కొప్పుల రవి గౌడ్. వార్డు సభ్యులు నేల్లపల్లి వెంకటయ్య,గునిగంటి మల్లేష్,గోరంట్ల రమేష్, కొరుపూర్ కుమార్,కాలే మల్లేష్,సల్వాది కళ్యాణ్,జాంగిర్,మౌలాన,మైనుద్దీన్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
